మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Sri Hatakeshwara Ashtakam – శ్రీ హాటకేశ్వరాష్టకం

జటాతటాంతరోల్లసత్సురాపగోర్మిభాస్వరం
లలాటనేత్రమిందునావిరాజమానశేఖరమ్ |
లసద్విభూతిభూషితం ఫణీంద్రహారమీశ్వరం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || 1 ||

పురాంధకాదిదాహకం మనోభవప్రదాహకం
మహాఘరాశినాశకం అభీప్సితార్థదాయకమ్ |
జగత్త్రయైకకారకం విభాకరం విదారకం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || 2 ||

మదీయ మానసస్థలే సదాఽస్తు తే పదద్వయం
మదీయ వక్త్రపంకజే శివేతి చాక్షరద్వయమ్ |
మదీయ లోచనాగ్రతః సదాఽర్ధచంద్రవిగ్రహం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || 3 ||

భజంతి హాటకేశ్వరం సుభక్తిభావతోత్రయే
భజంతి హాటకేశ్వరం ప్రమాణమాత్ర నాగరాః |
ధనేన తేజ సాధికాః కులేన చాఽఖిలోన్నతాః
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || 4 ||

సదాశివోఽహమిత్యహర్నిశం భజేత యో జనాః
సదా శివం కరోతి తం న సంశయోఽత్ర కశ్చన |
అహో దయాలుతా మహేశ్వరస్య దృశ్యతాం బుధా
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || 5 ||

ధరాధరాత్మజాపతే త్రిలోచనేశ శంకరం
గిరీశ చంద్రశేఖరాఽహిరాజభూషణేశ్వరః |
మహేశ నందివాహనేతి సంఘటన్నహర్నిశం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || 6 ||

మహేశ పాహి మాం ముదా గిరీశ పాహి మాం సదా
భవార్ణవే నిమజ్జతస్త్వమేవ మేఽసి తారకః |
కరావలంబనం ఝటిత్యహోఽధునా ప్రదీయతాం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || 7 ||

ధరాధరేశ్వరేశ్వరం శివం నిధీశ్వరేశ్వరం
సురాసురేశ్వరం రమాపతీశ్వరం మహేశ్వరమ్ |
ప్రచండ చండికేశ్వరం వినీత నందికేశ్వరం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || 8 ||

హాటకేశస్య భక్త్యా యో హాటకేశాష్టకం పఠేత్ |
హాటకేశ ప్రసాదేన హాటకేశత్వమాప్నుయాత్ || 9 ||

ఇతి శ్రీ హాటకేశ్వరాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.